Article Kids Poems %e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%a8 %e0%b0%a8%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf 107081400025_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవన నిధి

Advertiesment
నిన్నెత్తుకు ముద్దాడాలని అనిపిస్తున్నది!
, మంగళవారం, 14 ఆగస్టు 2007 (15:14 IST)
నిన్నెత్తుకు ముద్దాడాలని అనిపిస్తున్నది!
నీ సొగసే నా మది తెరపై కనిపిస్తున్నది!!
నీ పిలుపే తలపు తలపులో వినిపిస్తున్నది!
నీ వలపే సుఖానుభవ సుధ తినిపిస్తున్నది!!

నీ పైనే కవితలు రాయాలనిపిస్తున్నది!
నీ తోనే మనుగడ సాగించాలనిపిస్తున్నది!
నిను పొగడే పదములె పాడాలనిపిస్తున్నది!
నీ పొందుల విందే కావాలనిపిస్తున్నది!!

నిన్నెంచని క్షణమే కడు చేదనిపిస్తున్నది!
నీ కౌగిలి కన్న``సురుచి'' లేదనిపిస్తున్నది!!
నాలో గల ప్రతి ప్రతిభా నీదనిపిస్తున్నది!
నీలో గల ప్రతి అణువూ నాదనిపిస్తున్నది!!

నీ కోసమె నా ``జీవన నిధి'' అనిపిస్తున్నది!
నీ కొఱకే పయనం నా విధి అనిపిస్తున్నది!!
నిను మెప్పించనిది ``రచన'' కాదనిపిస్తున్నది!
నిను పొందక నా ప్రాణం పోదనిపిస్తున్నది!!!

Share this Story:

Follow Webdunia telugu