Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీర్ణం... వాతాపి జీర్ణం..!

Advertiesment
బాలప్రపంచం కవితం జీర్ణం వాతాపి జీర్ణం అర్జునుడు భీముడు గణపతి గుర్రము గుగ్గిళ్ళు ఏనుగు వెలక్కాయ అబ్బాయి పాలు
, సోమవారం, 3 నవంబరు 2008 (12:13 IST)
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అర్జునుడు తిన్న అరటిపండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి
గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై

అబ్బాయి తిన్న పాలు, ఆముదము అరిగి
అబ్బాయి తిన్న ఉగ్గు జీర్ణమై...
కుందిలాగా కూర్చొని నందిలాగా పాకి
లేడిలాగా లేచి తాంబేలు లాగా తారాడాలి...!

పామల్లెపాకి కుందల్లె కూర్చుండి
నందల్లె నడిచి గుఱ్ఱమంత పరుగు
ఏనుగంత సత్తువు ఉండేటట్లు
సాకుమా బిడ్డను సంజీవరాయ...!

Share this Story:

Follow Webdunia telugu