Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ..!

Advertiesment
బాలప్రపంచం
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ సశ్యామల సు శ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి...!!

Share this Story:

Follow Webdunia telugu