గురుదేవులు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌చే రచించబడిన జాతీయ గీతం " జన గణ మన " ను లోక్‌సభ జనవరి 24, 1950 నాడు జాతీయ గీతంగా ఆమోదించింది. ఈ జాతీయ గీతాన్ని తొలిసారిగా 27 డిసెంబరు, 1911న కోలకతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాడటం జరిగింది.
జాతీయ గీతం ఈ విధంగా ఉంది :
జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే, జయ హే, జయ హే జయ జయ జయ జయ హే iii
* జాతీయ గీతాన్ని కేవలం 52 సెకండ్లలోనే పాడాలి. ప్రత్యేక సమయాలలో గేయం ప్రారంభపు, చివరనున్న చిన్న పంక్తులను లఘు జాతీయ గీతంలా కేవలం ఇరవై సెకండ్లలోనే పాడాల్సివుంటుంది.
* ఎప్పుడైనా, ఎక్కడైనా జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంటే అప్పుడు ప్రతి పౌరుడు కూడా సావధానంగా నిలబడి ఆ గీతాన్ని గౌరవించడం ప్రతి భారతీయ పౌరుని కర్తవ్యం.