చిలుకల్లు చిలుకల్లు అందురేకాని
చిలుకలకు రూపేమి పలుకులేగాని
హంసల్లు హంసల్లు అందురేకాని
హంసలకు రూపేమి ఆటలేగాని
పార్వాలు పార్వాలు అందురేకాని
పార్వాలకు రూపేమి పాటలేగాని
కోయిల్లు కోయిల్లు అందురేకాని
కోయిల్లకు రూపేమి ఘోషలేగాని
చిలుకల్లు మా ఇంటి చిన్నికోడళ్ళు
హంసల్లు మా ఇంటి ఆడపడుచుల్లు
పార్వాలు మా ఇంటి బాలపాపల్లు
కోయిల్లు మాయింటి కొత్తకోడళ్ళు...!!