కులము లోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ..! వినుర వేమ...!
తాత్పర్యం :
వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నట్లయితే ఆ వనమంతా సువాసన వెదజల్లుతుంది. అలాగే... కులంలో ఒక వ్యక్తి గుణసంపన్నుడయి ఉన్నట్లయితే ఆ కులమంతా అతడి వల్ల గౌరవ మన్ననలను పొందుతుందని ఈ పద్యం యొక్క భావం.