గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం "గాంధీ"
రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి, మోసంద్వేషం విడిచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ... ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు "గాంధీ"
అవినీతిని గెలిచే బలమివ్వు "రఘు"
ప్రజలకు శాంతి సౌఖ్యం, కలిగించే దేశమే దేశం
బానిసభావం విడనాడి, ఏజాతి నిలుచునో అదిజాతి
బాపూః నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు "గాంధీ"
నీ బాటను నడిచే బలమివ్వు "రఘు"