Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంధము పూయరుగా.. పన్నీరు గంధము...!!

Advertiesment
బాలప్రపంచం
FILE
గంధము పూయరుగా పన్నీరు
గంధము పూయరుగా..

అందమైన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ "గం"

తిలకము దిద్దరుగా కస్తూరి
తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళ గని సొక్కుచు
పలుకుల నమృతము లొలికెడి స్వామికి "గం"

చేలము కట్టరుగా బంగారు
చేలము కట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో
ఆలమేపిన విశాలనయనునికి "గం"

హారతు లెత్తరుగా ముత్యాల
హారతు లెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక మొసగెడు వారిజాక్షునకు "గం"

పూజలు సేయరుగా మనసార
పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజనుతునకు "గం"

Share this Story:

Follow Webdunia telugu