కోపమునకు ఘనత కొంచెమైపోవును..!
కోపమునకు ఘనత కొంచెమైపోవునుకోపమునకు గుణము కొరత పడునుకోపమునకు బ్రతుకు కొంచెమైపోవునువిశ్వదాభిరామ వినుర వేమా..!తాత్పర్యం :కోపంవల్ల మనిషి తన కీర్తి ప్రతిష్టలన్నీ కోల్పోతాడు. కోపంవల్ల అతనిలో ఉన్న మంచి గుణాలన్నీ కరిగిపోతాయి. తరచూ కోపానికి గురయ్యేవారికి శత్రువులు పెరిగిపోతారు. దీనివల్ల లోకంలో బ్రతకటమే కష్టమైపోతుంది. జీవితం గౌరవంగా, సవ్యంగా సాగిపోవాలంటే కోపానికి దూరంగా ఉండాలన్న నీతిని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.