కృష్ణా లాలీ.. గోకుల కృష్ణా లాలీ
తామర సానయనా సత్యా కృష్ణాలాలీ "కృష్ణ"
బంగారు తొట్టెలో నీవు పవ్వళించరా
ప్రేమభక్తి పువ్వుల శయ్య పరచినానురా "కృష్ణ"
ఆడిపాడి చిందులు ద్రొక్కి అలసినావురా
చల్లగాను జోలబాడి పదములొత్తెదరా "కృష్ణ"
మోముదమ్మి పైన చెమట క్రమ్మియున్నదిరా
చూడలేను హృదయసీమ విశ్రమించరా "కృష్ణ"
పాలు మీగడ జీడిపప్పు ఆరగించరా
ఆరగించి చరణదాసికి శరణమివ్వరా "కృష్ణ"