కులములేనివాడు కలిమిచే వెలయును
కులములేనివాడు కలిమిచే వెలయునుగలిమి లేనివాడు కులము దిగునుకులముకన్న భువిని గలిమి ఎక్కువసుమీవిశ్వదాభిరామ... వినుర వేమా...!!తాత్పర్యం :కులము తక్కువవాడు సంపదవల్ల కీర్తిని పొందుతాడు. భాగ్యము లేనివాడు జీవన విధానాన్ని చూసుకుంటాడేగానీ, కులముతో పొత్తు పెట్టుకోడు. అంటే... కులము తక్కువ అయినా ధనం ఉంటే, పేరుప్రతిష్టలు వస్తాయి. ఎక్కువ కులం అయినవారికి ధనం లేకపోతే, ఎలాంటి పేరూ రాదు. కాబట్టి కులముకంటే సంపదే ముఖ్యమని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.