కాళ్ల గజ్జ- కంకాలమ్మ
వేగు చుక్క- వెలగ మొగ్గ
మొగ్గగాదు- మోదుగ నీరు
నీరుగాదు- నిమ్మలవాయ
వాయగాదు- వాయింటకూర
కూరగాదు- గుమ్మడి పండు
పండుగాదు- పాపడమీసం
మీసంగాదు- మిరియాలపోతు
పోతుగాదు- బొమ్మల శెట్టి
శెట్టిగాదు- శామమన్ను
మన్నుగాదు- మంచిగంధపు చెక్క
లింగులిటుకు- పందెమాల పటుకు
కాలు పండినట్లు- కడకు దీసి పెట్టు