"అబ్బబ్బా.. ఏంటా కాకి గోల, కాస్త ఆపండర్రా" అనే మాటలను తరచూ తరగతి గదుల్లో మాస్టార్ల నోటివెంట వింటుంటాం. అలాగే ఇళ్లలోని పెద్దవారు కూడా ఈ కాకి గోల అనే పదాన్ని వాడుతుంటారు. కాకి గోల అనే జాతీయాన్ని.. క్రమశిక్షణా రాహిత్యానికి, అసందర్భ ప్రేలాపనలకు ప్రతీకగా అంటుంటారు.
కాకులు కావు కావుమంటూ అరిచే తీరు, మిగిలిన పక్షుల కిలకిలా రావాలకంటే వినేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే... క్రమశిక్షణ లేకుండా, పెద్దల మాట వినకుండా.. తరగతి గదిలోనో, మరోచోటనో గుంపులు గుంపులుగా ఉంటూ, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతుంటే.. అది కూడా వినేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకున్న మన పెద్దలు... కాకుల గోలతో మనుషుల గోలను పోల్చుతూ ఈ కాకి గోల అనే జాతీయాన్ని వాడుకలోకి తెచ్చారు.