మృగమదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ...! వినుర వేమ...!
తాత్పర్యం :
కస్తూరి చూసేందుకు నల్లగా కనిపించినప్పటికీ... దాని సువాసన నాలుగు దిక్కులకూ వెదజల్లుతుంది. అలాగే పెద్దలైన వారు బయటికి ఆడంబరంగా కనిపించక పోయినప్పటికీ, వారు గొప్ప గుణాలను కలిగి ఉంటారని వేమన మహాకవి ఈ పద్యంలో చెప్పాడు.