కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ..!
తాత్పర్యం :
కమలములకు నివాసం నీరు. ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత మిత్రుడగు సూర్యుని వేడిచే కమలిపోతాయి. అలాగే మానవులు కూడా తమ తమ నివాసములను విడిచిపెట్టినచో, తమ స్నేహితులే విరోధులుగా మారి బాధించబడతారు. ఇది నిజమని అందరూ గ్రహించాలని ఈ పద్యం యొక్క భావం.