కనియు గానలేడు కదలింపడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్నిపాతం బిది
విశ్వదాభిరామ వినుర వేమ..!!
తాత్పర్యం :
కళ్లతో చూస్తూ కూడా యదార్థాన్ని తెలుసుకోలేడు. దేవున్ని స్మరించడు. ఆశ్చర్యం కలిగేటట్లు వింటూ కూడా... లోకంలోని విషయాలను తెలుసుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నించడు. ధనవంతుల దుష్ట లక్షణాలన్నీ ఈ రకంగానే ఉంటాయని ఈ పద్యంలో చెప్పాడు వేమన. కాబట్టి... ధనవంతులైనప్పటికీ, దేవుడిని స్మరించడం మరువకూడదు. నిజాలను గ్రహించాలి. లోకంలోని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని వేమన ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు.