ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపా పప్పూ మెంతీ పిండీ
తాటీ బెల్లం తవ్వెడు నెయ్యి
గుప్పెడు తింటే కులుకూలాడి
నడుమూకట్టే నామాట చిట్టీ
దూదూ పుల్ల దూరాయ్ పుల్ల
చూడాకుండా జాడా తియ్యీ
ఊదాకుండా పుల్లా తీయ్యీ
దాగుడుమూతా దండాకోర్
పిల్లీ వచ్చే ఎలుకా భద్రం
ఎక్కడి దొంగాలక్కణ్ణే గప్ చిప్...!!