ఒప్పులకుప్పా ఒయ్యారి భామ
మినపా పప్పు మెంతీ పిండి
తాటీ బెల్లం తవ్వెడు నేయి
గుప్పెడు తింటే కులుకూలాడి
సన్నాబియ్యం ఛాయాపప్పూ
పాలూ నెయ్యి పాయసం పొయ్యి
నీ మగడు తింటే ఆనందమట్టే
నడుమ గట్టె నామాటె చిట్టీ
దూదూ పుల్ల దురాయ్ పుల్ల
చూడాకుండా జాడా తియ్యీ
ఊదాకుండా పుల్లా తీయ్యీ
దాగుడుమూత దండాకోర్
పిల్లీ వచ్చే ఎలుకా భద్రం
ఎక్కడి దొంగలక్కడే గప్ చిప్