ఒకటి ఒకటి రెండు... వేళకు బడికి రండు
రెండు ఒకటి మూడు... ఒకరికి ఒకరం తోడు
మూడు ఒకటి నాలుగు... కలసి మెలసి మెలుగు
నాలుగు ఒకటి ఐదు... చెడ్డవారికి ఖైదు
ఐదు ఒకటి ఆరు... న్యాయం కోసం పోరు
ఆరు ఒకటి ఏడు... అందరి మేలు చూడు
ఏడు ఒకటి ఎనిమిది... భారతదేశం మనది
ఎనిమిది ఒకటి తొమ్మిది... కమ్మని మనసు అమ్మది
తొమ్మిది ఒకటి పది... చదువే మనకు పెన్నిధి....!!!