ఏడవకు కుశలవుడ రామకుమార..
ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుందూరు..
ఏడిస్తే నీ కండ్ల నీలాలు కారు
పాలైన కారవే బంగారు కండ్లూ..!
ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు
ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు...!
పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు
భూదేవి అమ్మమ్మ వెచ్చె నేడవకు..!
రావిరేకలు గొనుచు రత్నాలు గొనుచు
లక్ష్మన్న పినతండ్రి వచ్చె నేడవకు..!
ఏడవకు కుశలవుడ రామకుమార,
ఏడిస్తే నిన్నెవ్వ రెత్తుకుందూరు...!