హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ
తాత్పర్యం :
శ్రీరామచంద్ర మూర్తీ...! నీ నామం ఈశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్టమైన మంత్రము లాంటిది. అలాంటి పరమ పవిత్రమైన నీ నామము ఎల్లప్పూడూ మా నోట వెలువడేట్లు చేయుము తండ్రీ...! అని ఈ పద్యం యొక్క భావం.