ఎడ్డెమనుష్యుడేమెరుగు నెన్ని దినంబులు...!
ఎడ్డెమనుష్యుడేమెరుగు నెన్ని దినంబులు గూడియుండినన్దొడ్డ గుణాఢ్యునందుగల తోరపు వర్తనల్లబ్రజ్ఞచేర్పడ్డ వివేకరీతిః రుచిపాకము నాలుక గాకెఱుంగనే?తెడ్డది కూరలో గలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా...!తాత్పర్యం :మూఢాత్ముడు గుణవంతుడి వెంట తిరుగుతున్నప్పటికీ అతడి సద్గుణాలతో కూడిన నడవడికలు గుర్తించలేడు. అయితే దీనిని జ్ఞాని అయిన వ్యక్తి గుర్తించగలడు. ఎలాగంటే.. కూరలో తిరుగుచుండిన గరిటె ఆ కూర రుచిని గుర్తించలేదు. అదే కూర రుచిని నాలుక సులభంగా గుర్తిస్తుంది కదా..! అదే విధంగా సుజ్ఞాని అయినవ్యక్తి, సద్గుణాలతో కూడిన నడవడికలను చాలా సులభంగా గుర్తిస్తాడని ఈ పద్యం యొక్క భావం.