ఎండ వెనుకె వాన నిండు హర్షము నిచ్చు
రేయి వెనుకె పగలు హాయినిచ్చు
బాధ వెనుకె సుఖము బహుళమై చెలగురా
వాస్తవమ్ము నార్లవారి మాట...!!
తాత్పర్యం :
ఎండాకాలం తర్వాత కురిసిన వర్షం ఎంతో సంతోషాన్నిస్తుంది. రాత్రి తర్వాత వచ్చే పగలు కూడా హాయిని కలిగిస్తుంది. అలాగే కష్టాల తరువాత కలిగే సుఖం కూడా ఎక్కువ ఆనందాన్నిస్తుందని ఈ పద్యం యొక్క భావం.