తాత్పర్యం : ఎవరూ పుట్టుకతోనే ఉత్తములు కారు. అందరిలోనూ ఏవో కొన్ని చెడు గుణాలు ఉంటాయి. అయితే వాటిని క్రమంగా వదిలేస్తూ కొంతమంది ఉత్తములుగా మారతారు. కొంతమంది తమలోని ఆ చెడు గుణాలనే గొప్పవనుకుంటారు. అందుకే వాటిని మార్చుకోవాల్సి అవసరం లేదనుకుంటారు.
అలాంటివారు జీవితాంతం నీచులుగానే ఉండిపోతారు. వారిని ఎవరైనా మార్చాలనుకున్నా వారి ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఇత్తడిని ఎంతగా కరిగించి పోసినా అది బంగారంగా మారదు కదా.. అలాగే మారాలన్న తపనలేని నీచులకు ఉత్తమ గుణాల గురించి ఎంత చెప్పినా ఫలితం ఉండదని ఈ పద్యం సారాంశం.