Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉడుముండదే నూరేండ్లు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు ఉడు నూరు సంవత్సరాలు పాము వెయ్యి కొంగ మడుగు జీవితం ప్రయోజనం పని ఆసక్తి సుమతీ పద్యం
, సోమవారం, 22 సెప్టెంబరు 2008 (12:30 IST)
FileFILE
ఉడుముండదె నూఱేండ్లును
బడియుండదె పేర్మిబాము పదినూఱేండ్లున్
మడుపునగొక్కెర యుండదె
కడునిలబురుషార్దపరుడు గావలె సుమతీ...!

తాత్పర్యం :
ఉడుము నూరు సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, కొంగ మడుగులో చాలా కాలము దాకా జీవిస్తాయి. అయితే వాటివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అదే మంచిపనులను చేసే విషయంలో ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే.. వారివల్ల ప్రయోజనం ఉంటుందని సుమతీ శతకకారుడు ఈ పద్యంలో చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu