ఆవా ఆవా నీ పని ఏమీ..?
పాపా పాపా పాలిత్తును నేను
కుక్కా కుక్కా నీ పని ఏమి..?
దొంగలు వచ్చి గయ్యిమందును
పిల్లీ పిల్లీ నీ పని ఏమీ..?
ఎలుకలనే చంపుదును ఓ అమ్మాయీ
గుర్రమా గుర్రమా నీ పని ఏమి..?
బండిని లాగుదు బహు వేగముగా
మరి పాపా పాపా నీ పని ఏమీ..?
బడికిన్ పోదును, పాఠము చదువుదు
మరి బడి విడిచిన తరువాతనో..?
ఆడుదు ఆటల్, పాడుదు పాటల్..!