ఆదివారం నాడు అరటి మొలచింది
సోమవారం నాడు సుడివేసి పెరిగింది
మంగళవారం నాడు మారాకు తొడిగింది
బుధవారం నాడు పొట్టి గెల వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది
శుక్రవారం నాడు చకచకా గెలకోసి
అందరికీ పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి.. అమ్మాయి... అరటి పండ్లివిగో..!