Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్పబుద్ధివాని కధికారం

Advertiesment
బాలప్రపంచం కవితలు అల్పబుద్ధి అధికారం మిడిసిపాటు ఉత్తములు దూరం అల్పులు స్వభావం కుక్క పద్యం భావం హెచ్చరిక
, మంగళవారం, 25 నవంబరు 2008 (14:00 IST)
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
బుద్ధి తక్కువ వాడికి అధికారం ఇచ్చినట్లైతే, మిడిసిపాటుతో చెలరేగి ఉత్తములైన వారిని అవమానించి, దూరంగా తరిమి వేస్తారట. అల్పుల స్వభావమే అంత. వాళ్ల స్వభావం కుక్క స్వభావం లాంటిది, చెప్పులు తినే కుక్కకు చెరకు రుచి తెలియదని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి అల్పులకు అధికారం కట్టబెట్టవద్దని ఈ పద్యం ద్వారా హెచ్చరించాడు వేమన.


Share this Story:

Follow Webdunia telugu