Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుజలాం సుఫలాం..!

Advertiesment
బాలప్రపంచం జోకులు వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్ సస్యశ్యామలాం మాతరం కంఠం ధరణీ మాత
, సోమవారం, 29 సెప్టెంబరు 2008 (12:22 IST)
FileFILE
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం "వందే"

శుభ్రజ్యోత్స్నం పులకిత యామినీమ్
పుల్లకు సుమిత ద్రుమదల శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషినీం
సుఖదాం వరదాం మాతరం "వందే"

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం "వందే"

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే "వందే"

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, మాతరం "వందే"

శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం "వందే"

తాత్పర్యం :
తల్లికి నమస్కరించుచున్నాను. మంచినీరు, మంచి పంటలు, మలయమారుతముల చల్లదనం కలిగి, సస్యశ్యామలమైన (మా) తల్లికి నమస్కరించుచున్నాను. తెల్లని వెన్నెలతో పులకించిన రాత్రులు కలిగి, వికసించిన పూలు, చివురులుగల తరువులతో ప్రకాశించు దరహాసములతోనూ, మధుర భాషణంలతోను, సుఖమును, వరములను ఇచ్చు (మా) తల్లికి నమస్కరించుచున్నాను.

కోటి కోటి కంఠముల కల కల నినాదములతో కరకు తేలిన తల్లి..! కరకు కత్తులు ధరించిన అనేక కోట్ల భుజముల బలముగల మాతా..! అబలలకు బలమైనదేవీ? వివిధ శక్తులు ధరించి శత్రువుల నివారించుచు (మమ్ము) తరింపజేయగల మా తల్లీ...! నీకు నమస్కరించుచున్నాను.

నీవే విద్య, నీవే ధర్మం, నీవే హృదయము, నీవే మర్మము. శరీరములో ప్రాణము నీవే..! తల్లి...! మా శక్తివి, మా మనస్సులలోని భక్తివి నీవే..! మా హృదయ మందిరంలలో వెలసిన ప్రతిమవు నీవే...! నీకు నమస్కరించుచున్నాను.

పది ఆయుధములు చేతబట్టిన దుర్గవు నీవే...! పద్మదళములందు విహరించెడి లక్ష్మివి నీవే..! విద్యా దాత్రియైన శారదవు నీవే....! కమలా..! అమలా...! అతులా...! సుజలా...! సుఫలా...! శ్యామలా...! సరళా...! సుస్మితా...! అలంకృతా...! (మమ్ము) భరించుమాతా...! భూమాతా...! నీకు నమస్కరించుచున్నాను.

Share this Story:

Follow Webdunia telugu