రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన దశరథతనయా లాలీ "రామ"
అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ
బొజ్జలో పాలరుగగానే నిదురబొవేరా "రామ"
అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ
ముద్దుపాపలున్నారని మురిసి చూచేవూ "రామ"
ఎంతో యెత్తు మరగినావు యేమి సేతురా
ఇంతుల చేతుల కాకకు మేనెంతో కందునురా "రామ"
జోలపాడి జోకొడితే ఆలకించేవు
చాలించి మరియూరకుంటే సైగలు చేసేవు "రామ"
వెన్న పాలు ఉగ్గు నెయ్యి బాలుడ నీవు
తిన్నగ సేవించవయ్య తియ్యగ నుండు "రామ"