మంచి మనస్సుతో చేసిన మేలు చిన్నదయినా అది గొప్పదే: వేమన
చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబుకొంచెమైన నదియు గొదువగాదువిత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంతవిశ్వదాభిరామ వినురవేమ.మఱ్ఱి వృక్షము చూసిన ఎంతో విస్తరముగా ఉండును. కాని దాని విత్తనమును చూస్తే చిన్నది. అలాగే మంచిమనసుతో చేసిన పుణ్యం బహు చిన్నదిగా ఉన్నను ఉన్నత ఫలితమునే కలిగించును.