పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే ఏమవుతుంది?
పిల్లలకే స్వరాజ్యం ఇస్తే ఏం చేస్తారు?
చిట్టిపొట్టి పాపలనే రాణులను చేస్తాం
చిన్నారి బాబులనే రాజులను చేస్తాం
అమ్మమ్మ తాతయ్యలు బొమ్మలైతే
మా బొమ్మల పెళ్ళికి కబురంపిస్తాం
చక్కని పాటలు పాడి వినిపిస్తాం
కమ్మని విందులు గమ్ముగ తింటాం
స్కూళ్లలో మాస్టార్లు కరువైతే...
చిన్నారి పొన్నారులంతా పంతుళ్లమౌతం
పెద్దవాళ్లందరికీ బుద్ధిమతులు చెబుతాం
ఎర్రాని సూర్యుడు రంగూల కాగితమైతే
పొడవాటి దారంతో గాలిపటాలెగరేస్తాం
నక్షత్రాలే మందార మకరంద పుష్పాలైతే
పూమాలగా కట్టి దేవుడి మెడలో వేస్తాం..!