పాణి తలమున వెన్నయు
వేణికిమూలంబునందు వెలయగ పింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోక నాథుడ కృష్ణా...!!
తాత్పర్యం :
ఓ కృష్ణా...! నీవు లోకాలకెల్లా ప్రభుడవు. చేతిలో వెన్నముద్దయు, సిగలో నెమలి పింఛమును, ముక్కున ఆణిముత్యమును ధరించి పసిబాలునిలాగా ఉన్నావు కదా.. అని ఈ పద్యం యొక్క భావం.