Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పశుల వన్నె వేరు.. పాలేక వర్ణమౌ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు పశువులు పాలు ఆవులు రంగు పువ్వులు దేవుడు పద్యం భావం
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:04 IST)
పశుల వన్నె వేరు పా లేకవర్ణమౌ
బుష్పజాతి వేరు పూజ యొకటి
దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా
విశ్వదాభిరామ.. వినుర వేమా..!

తాత్పర్యం :
ఆవుల రంగులు వేరుగా ఉన్నప్పటికీ, పాల రంగు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. అలాగే పువ్వుల రకాలు, రంగులు వేరు వేరుగా ఉన్నప్పటికీ పూజ మాత్రం ఒక్కటే కదా. అలాగే దేవుళ్ళ పేర్లు ఎన్నిరకాలుగా ఉన్నప్పటికీ.. దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని గ్రహించాలని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu