నేరనన్నవాడు నెరజాణ మహిలోన..!
నేరనన్నవాడు నెరజాణ మహిలోననేర్తునన్నవాడు వార్త కాడుఊరకున్నవాడె ఉత్తమోత్తముడెందువిశ్వదాభిరామ వినుర వేమా..!!తాత్పర్యం :లోకంలో మూడు రకాల వ్యక్తులుంటారు. ఒకడు తనకు ఏపని చెప్పినా తెలియదని తప్పించుకుంటాడు. అతడు ఉపాయశాలి. రెండోవాడు ప్రతిదీ తనకే తెలుసని అంటాడు. ఇతడు మాటకారి. మూడవవాడు మౌనంగా పనులు చేసుకుంటూ వెళ్తాడు. ఇతడు ఉత్తమోత్తముడని ఈ పద్యంలో మెచ్చుకుంటున్నాడు వేమన మహాకవి.