Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ రూపంబు దలంపగా..!

Advertiesment
బాలప్రపంచం కవితలు రూపం శ్రీరాముడు పూజ పద్మం ఈశ్వరా పాలు నీళ్ళు కరుణ పద్యం భావం
, సోమవారం, 22 డిశెంబరు 2008 (12:12 IST)
నీరూపంబు దలంపగా తుదమెదల్నే ఆన నీవైనచో
రారారమ్మనియంచు చెప్పవు. వృథారంబంబులింకేటికిన్
నీరున్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడంజుమీ
శ్రీరామార్చిత పాదపద్మ యుగళా..! శ్రీకాళహస్తీశ్వరా...!!

తాత్పర్యం :
శ్రీరామునిచే పూజింపబడిన పాదపద్మముల జంటగల ఈశ్వరా...! నీ రూపము తుద మొదలు నేను కనిపెట్టలేను. నీవా నన్ను రమ్మని ఆహ్వానించవు. నిన్నే నమ్మియున్నాను. పాల ముంచిననూ, నీట ముంచిననూ భారము నీదే ఈశ్వరా..! నన్ను తొందరగా కరుణించమని వేడుకొనుచున్నాను అని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu