Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాశరథీ... కరుణాపయోనిథీ...!!

దాశరథీ... కరుణాపయోనిథీ...!!
FILE
హలికునకున్ హలాగ్రమున నర్థము సేకురుభంగి దప్పిచే
నలమటజెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీ పయిన్
దలవు ఘటింపజేసితిని దాశరథీ.. కరుణాపయోనిథీ..!!

తాత్పర్యం :
రైతునకు నాగేటి చివర భాగమున హఠాత్తుగా ధనం లభించినట్లుగా, దప్పికతో బాధపడేవారికి గంగానదీ జలం దొరికినట్లుగా, చెడు బుద్ధిగల నన్ను మంచివాడిగా చేసి, నా బుద్ధిని నీపై తలపు కలిగించునట్లుగా చేసినచో ధన్యుడనయ్యెదను దయాంతరుడవగు భద్రాద్రి శ్రీరామా...! నీకు నమస్కారములు...!! అని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu