Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దశరథనందన శ్రీరామ నమో..!

Advertiesment
బాలప్రపంచం
దశరథనందన శ్రీరామ నమో
అయోధ్యవాసి శ్రీరామ నమో
నీలమేఘశ్యామ శ్రీరామ నమో
జానకినాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్దన శ్రీరామ నమో
కోదండపాణీ శ్రీరామ నమో
రావణసంహార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సలా శ్రీరామ నమో

తాత్పర్యం :
దశరథునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు, సీతాదేవికి భర్త, భక్తుడైన హనుమంతుని చేత సేవించబడినవాడు, వాలిని వధించినవాడు, చేతిలో కోదండాన్ని ధరించినవాడు, దశకంఠుడైన రావణుడిని సంహరించినవాడు, దయా హృదయం కలవాడు, భక్తవత్సలుడు అయిన శ్రీరామ చంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. రామనామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కష్టసాధ్యమైన పనులు కూడా సుళువుగా చేయగలిగిన సామర్థ్యం వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu