తరగల్ పిప్పలపత్రముల్ మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోతకీట ప్రభల్
సురవీధీలిఖితక్షరంబు లసువుల్ జ్యోత్స్నా పయః పిండముల్
సిరులందేల మదాంధులౌదురొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా...!
తాత్పర్యం :
ప్రాణాలు, నీటి కెరటాలు, రావిఆకులు, అద్దపు మెరుగులు, గాలిలోని దీపాలు, గజముల కర్ణముల చివర చివుళ్ళు, ఎండమావులు, మిణుగురు పురుగుల కాంతులు అశాశ్వతమైనవి కదా...! సంపదలన్నీ కూడా వెన్నెలలోని పాలను ప్రోవు చేసినట్లుంటాయిగానీ, అవి ఎప్పటికీ స్థిరం కాదు. అయినా ప్రజలు ప్రాణాలతోను, సంపదలతోను, మదాంధులు అవుతున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదూ... శ్రీకాళహస్తీశ్వరా అని ఈ పద్యం యొక్క భావం.