చిన్ని మా అమ్మాయి శ్రీముఖము...!!
చిన్ని మా అమ్మాయి శ్రీముఖము చూడుసిగ్గుపడి జాబిల్లి పొడవగా వెరచుపందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటేపనసపండని జనులు పరుగులెత్తేరుదొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటేదోసపండని జనులు దోసిల్లొగ్గేరునీలాలు కెంపులు నిలువు వజ్రాలునిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోటపగడాలు రత్నాలు పారిజాతాలుపడతి మా అమ్మాయి పనిచేయు చోటఆడగా ముద్దమ్మ పాడగా ముద్దుఅందరికి మా అమ్మ అల్లారుముద్దు...!!