చందమామ తెలుపు... సన్నజాజి తెలుపు
మల్లెపూవు తెలుపు... మంచి మనసు తెలుపు
మందారం ఎరుపు... సింధూరం ఎరుపు
మంకెన పువ్వు ఎరుపు... మంచి మంట ఎరుపు
జీడిగింజ నలుపు... కట్టె బొగ్గు నలుపు
కారు చీకటి నలుపు... కాకమ్మ నలుపు
చామంతి పసుపు... పూబంతి పసుపు
బంగారం పసుపు... గన్నేరు పసుపు
సన్నజాజి తెలుపు... చామంతి పసుపు
మxదారం ఎరుపు... కోకిలమ్మ నలుపు