తోకను జాడించకే అంత వయ్యారంగా
గాలిపటమా... ఓహో గాలిపటమా..!
నిన్ను చూసి పతంగీ మెరుపులన్నీ
తోకముడిచి పరుగులెత్తాయే
మబ్బులకావల దాక్కున్నాయే
గాలిపటమా.. ఓహో గాలిపటమా...!
తగవులమారి.. తైతిక్కలాడుతూ
వెన్నెల వాకిట్లో గందరగోళం చేస్తే
నవ్వుల మామ కోప్పడతాడే
గాలిపటమా... ఓహో గాలిపటమా..!
చెడ్డదారుల్లో నీవు నడవకుండా
కట్టడి చేసే దారాన్నీ, నిన్నూ
గట్టిగా పట్టుకుంటుంది పాపాయీ..
గాలిపటమా... ఓహో గాలిపటమా..!!