Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికి..!

Advertiesment
బాలప్రపంచం
క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం "క్షీ"

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం "క్షీ"

చరణ కిసలయములకు సఖియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరత నానావర్ణ నీరాజనం "క్షీ"

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణివై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేలుమంగ చక్కదనముకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం "క్షీ"

Share this Story:

Follow Webdunia telugu