కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమునను బ్రతుకు కొంచెమైపోవును
విశ్వదాభిరామ.. వినుర వేమ...!
తాత్పర్యం :
తాను ఎంతటి ఉన్నత విద్యావంతుడైనప్పటికీ, గొప్పవాడైనప్పటికీ, కోపానికి బానిస అయితే తన గొప్పతనాన్ని కోల్పోతాడు. ఎందుకంటే, కోపం వలన మనిషి వివేకాన్ని కోల్పోతాడు. వివేకహీనుడు చెడు కార్యాలను చేస్తాడు. తద్వారా కోరి కష్టాలు కొనితెచ్చుకుంటాడు. కనుక కోపాన్ని జయించగలిగితే, సునాయాసంగా కీర్తి శిఖరాలను చేరుకోవచ్చని ఈ పద్యం యొక్క భావం.