కొండ అద్దమందు కొంచమై యుండదా..?
అనువుగాని చోట నధికులమనరాదుకొంచెముండుటెల్ల కొదువగాదుకొండ అద్దమందు కొంచమై యుండదా..?విశ్వదాభిరామ.. వినుర వేమ..!!తాత్పర్యం :అనువుగాని ప్రదేశంలో గొప్పవారమంటూ చెప్పుకోవటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. మన గొప్పదనాన్ని, ఆధిక్యతను ఆ ప్రదేశంలో ప్రదర్శించలేకపోయినా.. మనలో సహజంగా ఉండే ఔన్నత్యానికి ఎలాంటి లోటూ, భంగమూ జరగదు. అంత పెద్ద కొండ అయినా అద్దంలో చూస్తే, చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. అంత మాత్రానికే కొండ చిన్నది అయిపోయినట్లు భావించటం తగదు కదా. అలాగే అనువుగాని ప్రదేశంలో మన గొప్పతనాన్ని ప్రదర్శించలేనంత మాత్రాన, మన ఔన్నత్యం తగ్గిపోదని ఈ పద్యం ద్వారా వేమన మహాకవి సూచిస్తున్నాడు.