కలిగి కలిగియుండు కఠిన భావము చెంది
తెలియలేరు ప్రజలు తెలివిలేక..!
కలిమి వెన్నెలగతి గానంగలేరయా
విశ్వదాభిరామ వినుర వేమా...!
తాత్పర్యం :
సిరిసంపదలు శాశ్వతములని తలచి, ధన గర్వంతో కఠిన చిత్తులై, ఎవ్వరినీ లెక్క చేయకుండా కొంతమంది ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు. కానీ ఈ ఐశ్వర్యాలు, సుఖ భోగాలు వెన్నెల లాగానే అస్థిరములని గ్రహించలేక పోవడం ఎంత అజ్ఞానం.. అని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.