Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంత సదివిన నేమి వినిన..!!

Advertiesment
బాలప్రపంచం
ఎంత సదివిన నేమివినిన తన
చింత యేల మాను సిరులేల కలుగు
ఇతర దూషణములు ఎడసిన గాక
అతి కాముకుడు గానియప్పుడు గాక
మతి చంచలము గొంత మానిన గాక
గతియేల కలుగు దుర్గతులేలమాను "ఎంత"

పరధనముల యాస పాసినగాక
అరిది నిందలులేని యప్పుడు గాక
విరసవర్తనము విడచిన గాక
పరమేల కలుగు నాపద లేలమాను "ఎంత"

వేంకటపతి నాత్మ వెదకిన గాక
కింక మనసున దొలగిన గాక
బొంకు మాట లెడసి పోయిన గాక
శంక యేలమాను జయమేల కలుగు "ఎంత"

Share this Story:

Follow Webdunia telugu