చిమడకే చిమడకే ఓ చింతకాయ
నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు
ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ
నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు
ఉగకే ఉగకే ఓ జామకాయ
నువ్వెంత ఊగినా నీ తీపి పోదు
ఎండకే ఎండకే ఓ వేపకాయ
నువ్వెంత ఎండినా నీ చేదు పోదు!
జారకే జారకే ఓ జాజికాయ
నువ్వెంత జారినా నీ సుగుణాలు పోవు
ఊపకే ఉయ్యాల చిన్నారి పాపా
నువ్వెంత ఊపినా కిందపడిపోను..!