ఆడి తప్పువార లభిమానహీనులు..!
ఆడి తప్పువార లభిమానహీనులుగోడెడురగనివాడు కొద్దికాడుకూడి కీడు సేయు క్రూరుండు తలపోయవిశ్వదాభిరామ వినుర వేమా..!తాత్పర్యం :మాట ఇచ్చి తప్పేవాడు సిగ్గులేనివాడు. ఇతరుల బాధను అర్థం చేసుకోనివాడు అల్పుడు. స్నేహం చేసి నమ్మించి హానిచేసేవాడు క్రూరుడని ఈ పద్యం యొక్క భావం. అంటే.. తియ్యగా మాట్లాడటమేకాదు దాంట్లో సత్యముండాలి. ఎదుటివారి బాధకు జాలి చూపించటం కాదు, అర్థం చేసుకుని సాయపడాలి. అనుబంధం నటించి హానిచెయ్యటం కాదు, దానిని నిర్మలంగా కొనసాగించాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన.