"ఏంట్రా.. స్కూల్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చేశావు..?" అని ఆశ్చర్యంగా అడిగింది తల్లి
"టీచర్ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేశానమ్మా... అందుకే ఆవిడ నన్ను వెంటనే ఇంటికి పంపించేసింది" చెప్పాడు బన్నీ
"మా నాయనే... ఇంతకూ ఆ టీచర్ ఏం ప్రశ్న అడిగింది నాన్నా..?"
"తన మీదికి రాయి విసిరిందెవరని అడిగిందమ్మా.. వెంటనే నేనే మేడమ్ అని సరిగ్గా చెప్పేశాను.. అంతే వెంటనే పంపించేసింది.."